Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడ పుట్టిస్తోన్న కొవిడ్ కొత్త వేరియెంట్.. టీకాలు వేసినా ఉపయోగం లేదా