రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట

తనకు రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎం చిప్‌ను మార్చేసి చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తానంటూ ఓ రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన ఆర్మీ జవాను కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన జరిగింది. మారుతి ధక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు. మారుతి ఇటీవల శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వే ను కలిశాడు. ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు రూ. 2.5 కోట్లు అవుతాయని డిమాండ్ చేశాడు.

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట

|

Updated on: May 10, 2024 | 1:39 PM

తనకు రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎం చిప్‌ను మార్చేసి చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తానంటూ ఓ రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన ఆర్మీ జవాను కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన జరిగింది. మారుతి ధక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు. మారుతి ఇటీవల శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వే ను కలిశాడు. ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు రూ. 2.5 కోట్లు అవుతాయని డిమాండ్ చేశాడు. అనుమానించిన అంబాదాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో పట్టించేందుకు ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర.. నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించారు. అక్కడ రూ. 1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమ్మించి అడ్వాన్స్ కింద లక్ష రూపాయలు ముట్టజెప్పారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు మారుతికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయని, వాటిని ఇలా అడ్డదారుల్లో తీర్చాలని భావించాడని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీబేస్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌ !! ఎందుకంటే ??

అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??

ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

Follow us
Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం