అమ్మాయి పెళ్ళికి ఒక్కటైన ఊరు, ఇంటింటి నుంచి రూ. 50, 4 గ్లాసుల బియ్యం సేకరణ 

28 May 2024

TV9 Telugu

Pic credit - getty

ముర్వండి గ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో ఉంది. ఈ గ్రామంలో నివసిస్తున్న సుక్లూ రామ్ ప్రస్తుతం వారాల్లో నిలిచాడు. అతని కుమార్తె వివాహం ఈ రోజున జరగనుంది. ప్రస్తుతం  చర్చనీయాంశమైంది. 

సుక్లూ రామ్ కుటుంబం చాలా పేదది. పేదరికం కారణంగా కుమార్తె పెళ్ళి చేయలేని పరిస్థితి. గత ఐదేళ్లుగా కూతురికి పెళ్లి చేయాలనుకున్నా చేయలేకపోయింది ఆ కుటుంబం.

సుక్లూ రామ్ లోహర్ కులానికి చెందినవాడు. చిన్న చిన్న పనిముట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  

సుక్లూ రామ్ తన కూతురు బ్రిజ్‌బతి పెళ్లి గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవాడు. తండ్రి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గ్రామస్తులు సమావేశమయ్యారు. సుక్లూ రామ్ గ్రామం అంతా ఒక్కతాటిపైకి వచ్చి బ్రిజ్‌బతి పెళ్లి చేయాలనుకున్నారు. సుకాలు కూతురు పెళ్లికి సహకరించాలని అందరూ తీర్మానం చేసుకున్నారు.

ప్రతి ఇంటి నుంచి రూ.50, 4 గ్లాసుల బియ్యం సేకరించి వివాహానికి సహకరించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం రూ.3000, నాలుగు బస్తాల బియ్యం సేకరించారు. 

అంతేకాకుండా గ్రామానికి చెందిన కొందరు  బ్రిజ్‌బతి పెళ్లికి అవసరమైన ఇతర వస్తువులు కూడా ఇచ్చారు. 

గ్రామస్తులు అడవి నుంచి కలపను తీసుకువచ్చారు. చెట్ల ఆకులతో కల్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. నేడు మహారాష్ట్రలోని బోడేగావ్ నుంచి పెళ్లి ఊరేగింపు రాబోతోంది. వరుడి పేరు సంతోష్ గావ్డే.