అడవిలో వింత శబ్దాలు.. అక్కడ ఉన్నదాన్ని చూసి పరుగులు పెట్టిన యువకులు

Rajeev 

10 July 2024

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు వింతలు ఉంటాయి. సైన్స్‌కి అంతుచిక్కని కొన్ని మిస్టరీలుఎన్నో ఉన్నాయి ఈ భూమిపై 

అలాగే భూమిపై గ్రహాంతరవాసులు, దెయ్యాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతుంటారు. వీటిగురించి ఇప్పటికే చాలా న్యూస్ లు కూడా వచ్చాయి . 

చాలా మంది అవి ఒట్టి పుకారులే అని కొట్టిపారేస్తుంటారు. తాజాగా అమెరికాలో ఓ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. 

అమెరికాలోని ఓ అడవిలో మనిషి పాదం సైజు కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న పాదం అడుగులను గుర్తించారు. 

లూసియానాలో ఓ అడవిలో కొందరు విద్యార్థులు క్యాంపింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ఓ విచిత్రమైన జీవిని చూశారట. 

వారుపోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారికి పెద్ద పెద్ద పాదముద్రలు, వింత శబ్దాలు వినిపించాయట

ఫారెస్ట్‌లో ఇలాంటి పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి పెద్ద పాద ముద్రలు కనిపించాయని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు.