24 June 2024
TV9 Telugu
Pic credit - pexels
కొన్ని ప్రాంతాలకు వెళ్ళితే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక్కడకు వెళ్ళడానికి అనుమతులను నిరాకరిస్తూ నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు
భూమ్మీద ఉన్న భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి స్నేక్ ఐలాండ్. ఇక్కడకు ఓఫిడిఫోబియో అడుగు పెడితే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం
ఓఫిడిఫోబియో అంటే ఒక రకమైన ఫోబియా.. వీరికి పాములను చూస్తే చాలా భయం.. ఎంతగా అంటే పాము ఫోటో చూసినా చాలు వణుకే
గుట్టలు గుట్టలుగా పాములు ఉండే ప్రదేశాన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రం తీరం బ్రెజిల్‌లోని సావో పౌల్ లో ఉంది.
ఈ స్నేక్ ఐలాండ్ లో దాదాపు 110 ఎకరాల్లో వేలాది పాములు సంచరిస్తున్నాయని సైంటిస్టులు అంచనా వేసి మరీ చెప్పారు. ఈ పాములు చాలా బలంగా ఉంటాయని వెల్లడించారు.
ఈ దీవిలో ఉండే కొన్ని రకాల పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం ఉంటే మరికొన్ని చాలా విషపూరితమైనవని పరిశోధకులు చెప్పారు
పాముల నుంచి ప్రమాదం పొంచి ఉడడంతో ఇక్కడ ఇతర జీవరాశులు బతుకడం కష్టమని బ్రెజిల్ ఈ ప్రాంతంలో సంచరించడం చట్టవిరుద్ధం చేసింది.
ఈ ద్వీపం ప్రపంచంలోని ప్రాణాంతక విష సర్పాల్లో ఒకటైన బంగారు లాన్స్‌హెడ్ పాముకు నివాసం. ఈ జాతి పాములు ఇక్కడ 2,000 నుంచి 4,000 ఉంటాయని అంచనా.
ఈ దీవిలోని అరుదైన పాము జాతుల నుంచి వచ్చే విషం కొన్ని రకాల గుండె జబ్బులకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకనే వీటి విషానికి బ్లాక్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది.
డబ్బుల మీద ఆశతో పాము విషం కోసం చాలా మంది ప్రాణాలకు తెగించి మరీ ఈ దీపంలో పాములను పట్టుకోవడానికి వెళ్తారట. ఎవరినీ ఈ దీపంలోకి అడుగు పెట్టకుండా నావీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తుంది.