Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

IND Vs NZ Test Series: కివీస్‌తో మొదటి టెస్ట్.. మరోసారి కోహ్లీ మార్క్ డెసిషన్.. బరిలోకి ఆ ఇద్దరు.?

పొట్టి క్రికెట్‌ను మనం వైట్‌వాష్ చేస్తే.. వన్డేలను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ మరికొద్ది గంటల్లో ఆరంభం కాబోతోంది. వన్డేలలో చేసిన పొరపాట్లను...
Ind Vs Nz Test Series, IND Vs NZ Test Series: కివీస్‌తో మొదటి టెస్ట్.. మరోసారి కోహ్లీ మార్క్ డెసిషన్.. బరిలోకి ఆ ఇద్దరు.?

Ind Vs Nz Test Series: పొట్టి క్రికెట్‌ను మనం వైట్‌వాష్ చేస్తే.. వన్డేలను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ మరికొద్ది గంటల్లో ఆరంభం కాబోతోంది. వన్డేలలో చేసిన పొరపాట్లను పునరావృత్తం చేయకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కోహ్లీసేన బరిలోకి దిగబోతుండగా.. న్యూజిలాండ్ ఫుల్ జోష్‌తో మొదలపెట్టబోతోంది.

Also Read: Virat Kohli Retirement Plans

ఇదిలా ఉంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తమకు ఎంతో ముఖ్యమని మీడియా సమావేశంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా ఓటమిపాలవ్వని టీమిండియాకు ఈ టెస్ట్ సిరీస్ పెద్ద సవాల్‌గా మారుతుందని చెప్పాలి. అదే క్రమంలో కోహ్లీ బలమైన జట్టును ఎంపిక చేయనున్నాడని సమాచారం. ఈ తరుణంలోనే యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లకు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అంతేకాకుండా రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా వేటు పడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ICC Womens T20 World Cup Schedule

ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో పాటుగా మరో ఓపెనర్ పృథ్వీ షా బరిలోకి దిగనుండగా.. మిడిల్ ఆర్డర్‌లో ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, హనుమ విహారీలు ఆడనున్నారు. ఇక వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా కొనసాగనుండగా.. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా.. ముగ్గురు పెసర్లుగా ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

భారత్(అంచనా): మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా,  ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్(అంచనా): టామ్ లాథామ్, టామ్ బ్లండల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, బీజే వాట్లింగ్, కోలిన్ డి గ్రాండోమ్, జమీసొన్, సౌథీ, బౌల్ట్, మాట్ హెన్రీ

Related Tags