Personal growth: మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..

జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందుకోసమే కృషి చేస్తుంటారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశపడుతుంటారు. అయితే విజయం అందరికీ అంత సులువుగా దక్కదు. అందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది. ఇక మన విజయాన్ని కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు అడ్డుకుంటే మరికొన్ని సందర్భాల్లో...

Personal growth: మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..
Lifestyle
Follow us

|

Updated on: May 10, 2024 | 4:34 PM

జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందుకోసమే కృషి చేస్తుంటారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశపడుతుంటారు. అయితే విజయం అందరికీ అంత సులువుగా దక్కదు. అందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది. ఇక మన విజయాన్ని కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు అడ్డుకుంటే మరికొన్ని సందర్భాల్లో మనలోని కొన్ని గుణాలే అడ్డుకుంటాయి. ఇంతకీ మన విజయాలన్ని అడ్డుకునే ఆ శత్రువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మంది పనులు వాయిదా వేస్తుంటాం. నిర్లక్ష్యమో, చేద్దాంలే ఏముంది టెన్షన్‌ అనే ఆలోచనలో కారణం ఏదైనా మనలో చాలా మంది పనులు వాయిదా వేస్తు ఉంటాయి. అయితే విజయాన్ని అందుకోలేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ప్రధానమైంది. పనిని వాయిదా వేస్తే మనం వెనకబడుతున్నట్లే అర్థం చేసుకోవాలి. అనుకున్న పనిని ఆ క్షణంలోనే చేయడాన్ని అలవాటు చేసుకుంటే విజయం దానంతట అదే వస్తుంది.

* ఇక మనలో చాలా మంది ఏదైనా కొత్త పని చేయాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా ఓడిపోతామెమో అనే భయంలో ఉంటారు. ఈ భయమే మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఇక చిన్న చిన్న వైఫల్యాలకు కూడా వెనుకబడుగు వేస్తుంటారు. అయితే జీవితమనే ప్రయాణంలో వైఫల్యాలను, విజయాలను ఒకేలా చూసినప్పుడే విజయం మీ సొంతమవుతుందని గుర్తు పెట్టుకోవాలి.

* జీవితంలో ఎదగలనుకునే వారు ముందుగా వారి లోపాలను కూడా గుర్తించాలి. మీలోని లోపాలను మీరు గుర్తించడంలో మీ వ్యక్తిగత ఎదుగుదలకు మూల స్థంభం. మీ లోపాలను మీరు గుర్తించినప్పుడే వాటిని ఎలా అధిగమించాలన్న విషయం తెలుస్తుంది. లోపాలను సవరించుకుంటే ఆటోమెటిక్‌గా విజయం మీ సొంతమవుతుంది.

* చాలా మంది కంఫర్ట్‌ జోన్‌లోకి వెళ్లిపోతారు. కొత్తగా ఏదైనా చేయాలంటే భయంతో ఉంటారు. అందుకే ఒక బౌండరీ గీసుకొని అందులోనే బతికేస్తుంటారు. అయితే జీవితంలో విజయం సాధించిన చాలా మంది ఆ కంఫర్ట్‌ జోన్‌లో నుంచి బయటకు వచ్చిన వారే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

* మనలో కొందరు ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. ప్రదీ దాంట్లో పరిపూర్ణత ఉండాలంటే అక్కడే ఉండిపోతే మీరు మీ జీవితంలో అనుకున్న విజయాన్ని అందుకోలేరు. అందుకే కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా వదిలేస్తూ ముందుకు వెళ్లాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ