Avika Gor: క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్.. మరీ ఈ రేంజ్‏లో రెచ్చిపోయిందేంటీ..

డెవిడ్ వార్నర్ టాలీవుడ్ నటీనటులతో స్నేహంగా మెదులుతుంటారు. అలాగే వెస్టీండీస్ క్రికెటర్స్ కూడా నటీనటులతో సత్ససంబంధాలు కలిగి ఉంటారు. తాజాగా వెస్టీండీస్ క్రికెటర్.. కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‏తో హీరోయిన్ అవికా గోర్ చిందులేసింది. వీరిద్దరి కాంబోలో ఓ స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Avika Gor: క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్.. మరీ ఈ రేంజ్‏లో రెచ్చిపోయిందేంటీ..
Avika Gor
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2024 | 4:15 PM

సాధారణంగా సినీ తారలకు, క్రికెటర్లకు మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. కొన్నాళ్లుగా ఈ రెండు రంగాల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలకు, క్రికెటర్స్ మధ్య స్నేహబంధం ఉంటుంది. పలు పార్టీలలో వీరంతా కలిసే సందడి చేస్తుంటారు. అలాగే విదేశీ క్రికెటర్స్ సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని తారలతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంటారు. ఇటు డెవిడ్ వార్నర్ టాలీవుడ్ నటీనటులతో స్నేహంగా మెదులుతుంటారు. అలాగే వెస్టీండీస్ క్రికెటర్స్ కూడా నటీనటులతో సత్ససంబంధాలు కలిగి ఉంటారు. తాజాగా వెస్టీండీస్ క్రికెటర్.. కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‏తో హీరోయిన్ అవికా గోర్ చిందులేసింది. వీరిద్దరి కాంబోలో ఓ స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఆండ్రీ రస్సెల్ ఓవైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు ఆల్బమ్స్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రికెటర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోయిన్ అవికాగోర్ తో కలిసి ఓ స్పెషల్ ఆల్బమ్ చేశాడు. లడ్కీ తు కమాల్ కీ అంటూ సాంగే హిందీ ఆల్బమ్ తో అవికా గోర్ తో కలిసి రస్సెల్ హుషారైన స్టెప్పులు వేసి అలరించాడు. అంతేకాదండోయ్ ఈ పాటను రస్సెల్ స్వయంగా ఆలపించాడు. రంగు రంగుల కళ్లద్దాలు, నల్ల బనీన్, దానిపై గజిబిజి అక్షరాలతో ఫుల్ హ్యాండ్ షర్ట్, లుంగీని ధరించి రస్సెల్ స్టైలీష్ దేశీ స్టైల్లో కనిపించాడు. ఇక అవికా గోర్ నీలిరంగు చీరలో అదరగొట్టేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన స్పెషల్ ఆల్బమ్ ఆకట్టుకుంటుంది. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అప్పట్లో ఈ సీరియల్ నంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోయింది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు కథనాయికగా పరిచయమైంది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నిర్మాతగానూ రాణిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.