Allu Arjun: ఆ విషయంలో ముందుకొచ్చిన అల్లు అర్జున్.. మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
తెలుగు ఫిల్మ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం భారీగా సాయమందించారు. మే 4న దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు జన్మదినం సందర్బంగా ప్రతి ఏడాది డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్లను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతారు. అయితే ఈసారి పలు కారణాల వల్ల ఆ వేడుకలు వాయిదా పడ్డాయి. మే 19న ఎల్ బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప సినిమాతో ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న బన్నీ.. ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ నెట్టింట ప్రత్యేకంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిల్మ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం భారీగా సాయమందించారు. మే 4న దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు జన్మదినం సందర్బంగా ప్రతి ఏడాది డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్లను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతారు. అయితే ఈసారి పలు కారణాల వల్ల ఆ వేడుకలు వాయిదా పడ్డాయి. మే 19న ఎల్ బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం డొనేషన్ ఇచ్చారు. తాజాగా అల్లు అర్జున్ సైతం రూ. 10 లక్షలను విరాళంగా అందించారు. ఈరోజు బన్నీని కలిసి డైరెక్టర్స్ డే వేడుకలకు రావాల్సిందిగా కోరారు. ఇందుకు బన్నీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా బన్నీకి తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు సొంత భవనం కట్టాలని.. మెంబర్స్ అందరికీ హెల్త్ కేర్ ఉండాలని చూస్తున్నారు. ఇందుకోసమే ఈ నిధులను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
Members of TFDA Committee, Director of Tollywood today met Icon star @alluarjun garu to invite him to the Directors’ day event on 19th May. He generously presented them with a cheque of 10 Lakhs Immediately and also extended his full support for the construction of new building.… pic.twitter.com/bLf2o8TcPs
— GSK Media (@GskMedia_PR) May 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.