Kovai Sarala : పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. ఆ హీరో నాకోసం వేయిట్ చేశాడు.. కోవై సరళ..

ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. కొన్నాళ్లపాటు అసలు మీడియా ముందుకు రానీ ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గోన్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Kovai Sarala : పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. ఆ హీరో నాకోసం వేయిట్ చేశాడు.. కోవై సరళ..
Kovai Sarala
Follow us

|

Updated on: May 10, 2024 | 3:27 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు కోవై సరళ. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. మాటల్లో వెటకారం.. నటనతో హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సహజ నటనతో తెలుగువారికి దగ్గరయ్యింది. వెండితెరపై లేడీ కమెడియన్‏ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. కొన్నాళ్లపాటు అసలు మీడియా ముందుకు రానీ ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గోన్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

కోయంబత్తూరులో జన్మించిన సరళ.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుందట. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఏర్పడడంతో సినిమాల్లోకి రావాలనుకున్నానని.. అదే విషయాన్ని తన తండ్రితో చెపితే వెంటనే ఒకే అన్నారని తెలిపింది. తెలుగులో మూడు ముళ్లు సినిమా చేసిన డైరెక్టర్ తన ఇంటి పక్కన ఉండేవారని.. తనకు అవకాశం ఇస్తానని చినప్పుడే మాట ఇచ్చారని.. అలా తాను తెరకెక్కిస్తున్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారని తెలిపింది. సినిమాల కోసమే డాన్స్ నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. “పెళ్లి కచ్చితంగా చేసుకోవాలని కండీషన్ లేదు. స్వేచ్ఛ కోసమే చేసుకోలేదు. బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఆ తర్వాతే బంధాలన్నీ వచ్చాయి. ఎంతో మంది పిల్లలు ఉన్నవాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. దైర్యంగా ముందుకు వెళ్లాలి ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ అసిస్టెంట్ నుంచి ఫోన్ వచ్చిందని.. కానీ అప్పుడు తాను నమ్మలేదని తెలిపింది. కమల్ హాసన్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నప్పు చెప్పినప్పుడు తెలుగులో బిజీగా ఉన్నానని చెప్పడంతో దాదాపు 5 నెలలు వెయిట్ చేశారని .. ఆ తర్వాత ఆ సినిమాలో నటించినట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ