Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా..?
Bank Holidays: మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యుపి ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే ఈ సమయంలో యుపిఐ, మొబైల్..

బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, శుక్రవారం అంటే మార్చి 21 నాటికి దాన్ని పూర్తి చేసుకోండి. దీని తర్వాత మార్చి 22 నుండి మార్చి 25 వరకు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి 26న బ్యాంకులు తెరుచుకుంటాయి. శనివారం 22, ఆదివారం 23 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తర్వాత సోమవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు సమ్మె నిర్వహించనున్నారు.
సమ్మె ఎందుకు?
మంగళవారం న్యూఢిల్లీలో బ్యాంకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత మార్చి 23, 24 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగులు పనిచేయరు.
యూపీఐ, ఏటీఎం సేవలు:
మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యుపి ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే ఈ సమయంలో యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి: Sunita Williams: సముద్రంలో సునీత విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి