అలియా ముద్దుపేరు ఎంటో తెలుసా?
19 March 2025
Prudvi Battula
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ అలియా భట్.
అనతికాలంలోనే తన అందం, అభియనంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార.
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీనటుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఒకరు.
రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిందీ బాలీవుడ్ అందాల తార.
ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీలో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా భట్ అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
అదేంటంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న అలియా భట్ 12వ తరగతి కూడా పూర్తి చేయలేదట.
ఇక అలియా భట్ ముద్దుపేరు ఎంటో తెలుసా? పొటాటో. తనతో క్లోజ్ గా ఉన్న చాలామంది ఆమెను ఈ పేరుతోనే పిలుస్తారట.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!