బ్రేకింగ్, ఈసీకి ఆ అధికారం లేదు, సుప్రీంకోర్టు,

మధ్యప్రదేశ్ లో జరగనున్న ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్...  కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

బ్రేకింగ్, ఈసీకి ఆ అధికారం లేదు, సుప్రీంకోర్టు,

Edited By:

Updated on: Nov 02, 2020 | 1:59 PM

మధ్యప్రదేశ్ లో జరగనున్న ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్…  కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనకు ఈ హోదాను తొలగిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. ఈసీకి ఆ అధికారం లేదని సీజేఐ ఎస్.ఎ .బాబ్డే స్పష్టం చేశారు.  ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ ‘ఐటమ్’ అని అభివర్ణించడం, దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఈసీని ఆశ్రయించడం, ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ కమల్ నాథ్ సుప్రీంకోర్టుకెక్కడం తెలిసిందే. (కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసిన విషయం గమనార్హం).