ఆంధ్రాఒడిశా బోర్డర్లో మావోయిస్టు డంప్ స్వాధీనం
ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మావోయిస్టు డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో ఈ డంప్ గుర్తించారు ఒడిశా మల్కన్‌గిరి పోలీసులు. ఈనెల 27న భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సమయంలో కొంతమంది మావోయిస్ట్‌లు తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి మావోయిస్ట్‌ల కోసం భద్రతా దళాలు అడవిని జల్లెడ పడుతుండగా.. ఈ డంప్ కనిపించింది. స్వాధీనం చేసుకున్న డంప్‌లో 32 డిటో నేటర్లు, SLR, AK 47 తుపాకులు.. ఇన్సాస్ […]

ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మావోయిస్టు డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో ఈ డంప్ గుర్తించారు ఒడిశా మల్కన్‌గిరి పోలీసులు. ఈనెల 27న భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సమయంలో కొంతమంది మావోయిస్ట్‌లు తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి మావోయిస్ట్‌ల కోసం భద్రతా దళాలు అడవిని జల్లెడ పడుతుండగా.. ఈ డంప్ కనిపించింది. స్వాధీనం చేసుకున్న డంప్‌లో 32 డిటో నేటర్లు, SLR, AK 47 తుపాకులు.. ఇన్సాస్ తుపాకుల బుల్లెట్లు, ఓ మ్యాగజైన్, మావో యూనిఫాంలు, 11 కిట్ క్యారేజీ బాక్స్‌లు ఉన్నాయి. ఇది ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన డంప్ గా పోలీసుల గుర్తించారు.



