చెన్నైలో రూ.5వేల కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ః గడ్కరీ
పెరుగుతున్న జనాభా దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వా రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు చేపట్టబోతోంది.

పెరుగుతున్న జనాభా దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వా రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు చేపట్టబోతోంది. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో 5వేల కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై ఓడరేవు నుంచి వివిధ ప్రాంతాలను కలుపుతూ ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేలా డబుల్ డెక్కర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రమంత్రి కె. పళనీస్వామితో కలిసి కొత్త ఫ్లైఓవర్ నిర్మాణాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ చర్చించారు. నాలుగు లైన్లతో కూడిన వంతెన డిజైన్ ను అంతర్జాతీయ నిపుణులతో రూపొందించామని మంత్రి చెప్పారు. ఈ వంతెన నిర్మాణంతో రాబోయే 25 ఏళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలుండవని మంత్రి పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.3100 కోట్లు కాగా, దాని వ్యయం 5వేల కోట్లకు పెంచుతున్నట్లు గడ్కరీ తెలిపారు. చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.




