భారత్‌లో 80లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనాా తీవ్రత తగ్గింది.  కొత్తగా 49,881 కేసులు నమోదయ్యాయి. మరో 517మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

భారత్‌లో 80లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Oct 29, 2020 | 4:59 PM

దేశంలో కరోనా తీవ్రత తగ్గింది.  కొత్తగా 49,881 కేసులు నమోదయ్యాయి. మరో 517మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. గడిచిన 24గంటల్లో 53,480మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 73,15,989కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

మొత్తం దేశంలో కరోనా కేసులు : 80,40,203

కొత్తగా నమోదైన కేసుల సంఖ్య : 49,881

దేశంలో మొత్తం కరోనా మరణాలు : 1,20,527

గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన మరణాల సంఖ్య : 517

ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య : 6,03,687

సెప్టెంబర్​ 28న దేశంలో కేసుల సంఖ్య 60లక్షల మార్కును దాటింది.  ఈ నెల 11న కేసుల సంఖ్య 70 లక్షలు క్రాస్ చేసింది. తాజాగా నేడు 80 లక్షల మార్కును  దాటింది.  ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల రికవరీ రేటు 90.99 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి డెత్ రేటు తగ్గింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.51 గా ఉంది.

Also Read :

తెలంగాణ : రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు