ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా

ప్రముఖ సౌత్ ఇండియా నటి  పూనమ్ బజ్వా తన అభిమానులను సర్​ప్రైజ్​ చేశారు. తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. ప్రియుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా
Ram Naramaneni

|

Oct 29, 2020 | 11:13 AM

ప్రముఖ సౌత్ ఇండియా నటి  పూనమ్ బజ్వా తన అభిమానులను సర్​ప్రైజ్​ చేశారు. తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. ప్రియుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మొదటి సినిమా’ (2005)తో కెరీర్‌ ఆరంభించించి ఈ మద్దుగుమ్మ… ‘బాస్‌’, ‘పరుగు’ తదితర చిత్రాలలో మంచి పాత్రలు పోషించింది. చివరిగా తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రను పోషించింది. తాజాగా తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ.. ప్రియుడికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది.

‘సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్‌, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని పూనమ్‌ ప్రియుడిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. ఆమె పోస్ట్‌కు ఫాలోవర్స్‌తోపాటు సినీ సెలబ్రిటీస్ సందీప్‌ కిషన్‌, కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందించారు. నటికి బెస్ట్ విషెస్ చెప్పారు.

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

తెలంగాణ : రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu