నిర్భయ కేసు దోషులకు భద్రత కట్టుదిట్టం.. ఒక్కొక్కరికి ఐదుగురి నిఘా

ఎప్పుడెప్పుడు ఆ రాక్షసులను ‘ఉరి’ తీస్తారా అని వేల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉరికి సంబంధించి మరిన్ని కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే.. నిర్భయ దోషులకు పటిష్ఠవంతమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. ఒక్కోక్కరికి ఐదుగురి చొప్పున పోలీసులు నిఘాను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఉరి తీసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలతో.. వారు మానసిక ఒత్తిడికి లోనయిట్లు తీహార్ జైలు నుంచి సమాచారం. దీంతో.. వారు అఘాయిత్యాలకు […]

నిర్భయ కేసు దోషులకు భద్రత కట్టుదిట్టం.. ఒక్కొక్కరికి ఐదుగురి నిఘా
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 5:34 PM

ఎప్పుడెప్పుడు ఆ రాక్షసులను ‘ఉరి’ తీస్తారా అని వేల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉరికి సంబంధించి మరిన్ని కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే.. నిర్భయ దోషులకు పటిష్ఠవంతమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. ఒక్కోక్కరికి ఐదుగురి చొప్పున పోలీసులు నిఘాను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఉరి తీసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలతో.. వారు మానసిక ఒత్తిడికి లోనయిట్లు తీహార్ జైలు నుంచి సమాచారం. దీంతో.. వారు అఘాయిత్యాలకు పాల్పడే ఛాన్స్‌ ఉండటంతో మరింత భద్రతను కట్టుదిట్టం చేశారట. దీంతో.. వారిని ఉరి తీసేంతవరకూ అందరికీ ఎంతో ఉత్కంఠ నెలకొంది. అలాగే.. ఉరి తీసే ప్రాంతాన్ని కూడా శుభ్రపరిచినట్టు సమాచారం.

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత.. నిర్భయ కేసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ నెల 16వ తేదీన ఉదయం 5 గంటలకు వారిని ఉరి తీస్తున్నారని అనధికారికంగా సమాచారం ఉంది. అయితే.. అక్షయ్.. ఉరిశిక్షపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న పిల్‌పై వాదనలు జరగనున్నాయి. కాగా.. మిగిలిన ముగ్గురు దోషులు.. పవన్ గుప్తా, ముకేష్, వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేసుకోగా.. సుప్రీం వాటిని తిరస్కరించిన విషయం తెలిసిందే.