ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్​​ పద్మపై కేసు నమోదు

|

Jan 12, 2020 | 10:10 AM

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై పోలీసు కేసు నమోదైంది. మహిళల తరుఫున పోరాడాల్సిన పదవిలో ఉండి..తమనే కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ కొందరు మహిళా రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. న్యాయం కోసం అమరావతి మహిళా రైతులు రోడెక్కి పోరాడుతుంటే, మద్దతు పలకాల్సిందిపోయి..అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మహిళా కమిషన్  ఛైర్ పర్సన్ పదవికి పద్మ కళంకం తెచ్చారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని మహిళా రైతులు […]

ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్​​ పద్మపై కేసు నమోదు
Vasireddy Padma
Follow us on

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై పోలీసు కేసు నమోదైంది. మహిళల తరుఫున పోరాడాల్సిన పదవిలో ఉండి..తమనే కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ కొందరు మహిళా రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. న్యాయం కోసం అమరావతి మహిళా రైతులు రోడెక్కి పోరాడుతుంటే, మద్దతు పలకాల్సిందిపోయి..అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మహిళా కమిషన్  ఛైర్ పర్సన్ పదవికి పద్మ కళంకం తెచ్చారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని మహిళా రైతులు కోరారు. ఈ మేరకు  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు నిరసన తెలుపుతోన్న అమరావతి ప్రాంత మహిళలపై సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెడుతోన్న వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిపై కూడా మరో కంప్లైంట్ నమోదైంది.