ఎన్నికల్లో విజయందుందుబి మోగించిన వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని పార్క్ విల్లే దగ్గర ఉదయం నుంచిసెక్యూరిటీ నిబంధనలు అమలు చేశారు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడంతోపాటు నివాసానికి వెళ్లే రోడ్డులో అనధికారిక వాహనాలను అనుమతించడంలేదు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇంటిలిజెన్స్, సివిల్ పోలీస్ బృందాలు నిరంతరం పహారా కోసం రంగంలోకి దిగాయి.
సీఎంల ఇంటి దగ్గర అత్యాధునిక ఇంటిలిజెన్స్ వింగ్‌గా ఏర్పాటుచేసే ఐఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.