AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం మ‌రో గుడ్ న్యూస్…వారికి ఉచితంగా 8 వంట గ్యాస్ సిలిండర్లు

కరోనా వైరస్ కట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక ర‌కాలుగా సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం(PMUY) లబ్దిదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ ను ఉపయోగించే వినియోదారులకు… రాబోయే మూడు నెలల్లో 8 సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు […]

కేంద్రం మ‌రో గుడ్ న్యూస్...వారికి ఉచితంగా 8 వంట గ్యాస్ సిలిండర్లు
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2020 | 12:47 PM

Share

కరోనా వైరస్ కట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక ర‌కాలుగా సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం(PMUY) లబ్దిదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ ను ఉపయోగించే వినియోదారులకు… రాబోయే మూడు నెలల్లో 8 సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో 8 కోట్ల మంది లబ్ది పొంద‌నున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే పీఎంయూవై లబ్దిదారులకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లు వాడే వారికి మూడు, 5కేజీల సిలిండర్లు వాడే వారికి 8 చొప్పున ఇవ్వనున్నారు. మూడు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఇస్తారు. లాక్ డౌన్ అయినప్పటి నుండి, దేశంలో రోజుకు 50 నుండి 60 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామ‌ని… చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్న‌ప్ప‌టికి .. బుక్ చేసిన రెండు రోజుల లోప‌ల్లేనే సిలిండ‌ర్లు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

50 మిలియన్ల పేద గృహాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు కల్పించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 మే 1 న బల్లియా (ఉత్తర ప్రదేశ్) లో పిఎంయువై ప్రారంభించారు. తరువాత, లక్ష్యాన్ని 80 మిలియన్ల గృహాలకు పెంచారు. ఈ టార్గెట్ అనుకున్న స‌మ‌యానికి ఆరు నెల‌లు ముందుగా 2019 సెప్టెంబర్ 7 న సాధించబడింది.

Follow Us
MBBS, BDS మెడికల్‌ కోర్సుల ఫీజులు పెరిగాయ్.. పూర్తి వివరాలు ఇవిగో
MBBS, BDS మెడికల్‌ కోర్సుల ఫీజులు పెరిగాయ్.. పూర్తి వివరాలు ఇవిగో
ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్
ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్
తులా రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు కెరీర్, వ్యాపారంలో లాభాలు!
తులా రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు కెరీర్, వ్యాపారంలో లాభాలు!
రూ.299తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు సిమ్‌ యాక్టివ్‌గా ఉంటుందా
రూ.299తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు సిమ్‌ యాక్టివ్‌గా ఉంటుందా
శోభనం సీన్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ బోరున ఏడ్చేసింది..
శోభనం సీన్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ బోరున ఏడ్చేసింది..
ఇన్-సర్వీస్ టీచర్లకు 'TET 2026' పరీక్షల షెడ్యూల్.. టైమింగ్స్ ఇవే
ఇన్-సర్వీస్ టీచర్లకు 'TET 2026' పరీక్షల షెడ్యూల్.. టైమింగ్స్ ఇవే
పెట్రోల్ బంక్‌లో మంటలు.. బైక్ క్షణాల్లో బుగ్గి!
పెట్రోల్ బంక్‌లో మంటలు.. బైక్ క్షణాల్లో బుగ్గి!
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు
సోఫా లేదా బెడ్ పై టీ ఒలికిపోయిందా.. కంగారే వద్దు ఇలా చేయండి
సోఫా లేదా బెడ్ పై టీ ఒలికిపోయిందా.. కంగారే వద్దు ఇలా చేయండి
రాయిలా కనిపిస్తుంది.. కానీ కాలు వేస్తే ఖతం..!
రాయిలా కనిపిస్తుంది.. కానీ కాలు వేస్తే ఖతం..!