పెరిగిన మోదీ ఇమేజ్… టాప్ వన్ నాయకుడిగా గుర్తింపు

|

May 27, 2020 | 3:25 PM

ప్రధాని నరేంద్ర మోడీ టాప్ రెంజ్‌లో దూసుకుపోతున్నారు. పాలన తీరు, కరోనాపై పోరు… ఒకటేమిటి అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రపంచ రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టి టాప్ నెంబర్ వన్ ప్లేసులో ముందుకు సాగుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరు ఆయనకు ప్రజాదరణను మరింత పెంచిందని ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ పేర్కొంది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన […]

పెరిగిన మోదీ ఇమేజ్... టాప్ వన్ నాయకుడిగా గుర్తింపు
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ టాప్ రెంజ్‌లో దూసుకుపోతున్నారు. పాలన తీరు, కరోనాపై పోరు… ఒకటేమిటి అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రపంచ రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టి టాప్ నెంబర్ వన్ ప్లేసులో ముందుకు సాగుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరు ఆయనకు ప్రజాదరణను మరింత పెంచిందని ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ పేర్కొంది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోల్ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కూడా టాప్‌లోనే ఉండగా… ఇప్పుడు కూడా తన స్థానాన్ని కాపాడుకున్నారు. అప్పుడు 74 శాతం మంది భారతీయులు మోదీకే ఓటు వేయగా… తాజాగా మే 19న నిర్వహించిన పోల్‌లో 8 శాతం ఓట్లు పెంచుకొన్నారు. మోదీ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ 66శాతం ఓట్లను దక్కించుకున్నారు. మూడో స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మొర్కెల్ ఆ తర్వాతే ప్లేస్‌ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బోరిస్ జాన్సన్ ఉన్నారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఐదవ స్థానం నిలిచారు.