భారతీయత ఉట్టిపడేలా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం.. సెంట్రల్ విస్టాకు ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం

|

Dec 10, 2020 | 1:44 PM

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా 'సెంట్రల్ విస్టా' పేరుతో నిర్మిస్తున్నారు. నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 12.55 నిమిషాలకు భూమి పూజను నిర్వహించారు.

భారతీయత ఉట్టిపడేలా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం.. సెంట్రల్ విస్టాకు ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం
Follow us on

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా ‘సెంట్రల్ విస్టా’ పేరుతో నిర్మిస్తున్నారు. నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 12.55 నిమిషాలకు భూమి పూజను నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మిస్తున్నారు. మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మధ్యాహ్నం 1.00 గంటకు ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. నవధాన్యాలు, నవరత్నాలను వేసి, వాస్తు పురుషుడికి పూజలు నిర్వహించారు. నేటితో నిర్మాణం మొదలై.. ఆగస్టు 15, 2022లో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకునే సమయానికి కొత్త పార్లమెంటు అందుబాటులోకి రానుంది.

ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విదేశాల రాయబారులు పాల్గొన్నారు. అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు విర్చువల్‌ ద్వారా హాజరయ్యారు. శంకుస్థాపన ముగిసిన తర్వాత సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

మొత్తం 64,500 చదరపు మీటర్ల వైశాల్యాంతో సుమారు రూ. 971 కోట్ల అంచనాలతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంటులోని లోక్ సభలో 888 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా భవన నిర్మాణం సాగనుంది. భవిష్యత్తులో మొత్తం 1,224 సభ్యులు కూర్చునేలా ఈ నిర్మాణం జరగనుంది. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా, భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరిగినా వారికి కూడా సరిపోయేలా హాల్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తుశాఖకు అప్పగిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు