బీహార్ ఎన్నికల యుద్ధంలోకి బీజేపీ స్టార్ క్యాంపెయినర్

|

Oct 16, 2020 | 10:30 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలు ఖరారవడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటములు రెండూ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్.. ప్రధాని అయిన నరేంద్రమోదీ బీహార్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, సీఎం అభ్యర్థి, జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ తో కలిసి 12 ఎన్నికల ర్యాలీలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 23, […]

బీహార్ ఎన్నికల యుద్ధంలోకి బీజేపీ స్టార్ క్యాంపెయినర్
Follow us on

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలు ఖరారవడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటములు రెండూ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్.. ప్రధాని అయిన నరేంద్రమోదీ బీహార్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, సీఎం అభ్యర్థి, జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ తో కలిసి 12 ఎన్నికల ర్యాలీలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 23, అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 3న ఈ ర్యాలీలను నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. అక్టోబర్ 23: సాసారమ్, గయ, బాగల్పూర్, అక్టోబర్ 28: దర్బంగ, ముజఫర్ పూర్, పాట్నా, నవంబర్ 1: చహప్రా, తూర్పు చంపారణ్, సమస్తిపూర్, నవంబర్ 3: పశ్చిమ చంపారణ్, సహర్స, అరారియా ప్రాంతాల్లో మోదీ ప్రచారం చేస్తారు. మోదీ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారు.