హిమదాస్.. యూ ఆర్ గ్రేట్.. నిన్ను చూసి దేశం గర్విస్తోంది: మోదీ అభినందన

| Edited By: Srinu

Jul 22, 2019 | 7:23 PM

భారత స్టార్ అథ్లెట్ హిమదాస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. హిమదాస్‌ను చూసి భారత అభిమానులు మురిసిపోతున్నారని చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. పరుగుల తార హిమదాస్ ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు. గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరపున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధాని మోదీ […]

హిమదాస్.. యూ ఆర్ గ్రేట్.. నిన్ను చూసి దేశం గర్విస్తోంది: మోదీ అభినందన
Follow us on

భారత స్టార్ అథ్లెట్ హిమదాస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. హిమదాస్‌ను చూసి భారత అభిమానులు మురిసిపోతున్నారని చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. పరుగుల తార హిమదాస్ ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు.

గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరపున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.