జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు..

టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు..

Updated on: Sep 08, 2020 | 2:26 PM

Pm Modi Condoles  : టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జయ ప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని అన్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని గుర్తు చేసుకున్నారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు అంటూ ట్వీట్ చేశారు. జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధాని మోదీ.

‘జయ ప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.