క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

ఈ ఏడాది ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న వేళ, టోర్నీ నిర్వహించొద్దని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐకి పర్మిషన్ ఇవ్వొద్దని కోరుతూ న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంజ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా పిటిషనర్ పలు ఆసక్తికర విషయాలను […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 11, 2020 | 11:42 AM

ఈ ఏడాది ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న వేళ, టోర్నీ నిర్వహించొద్దని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐకి పర్మిషన్ ఇవ్వొద్దని కోరుతూ న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంజ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

కాగా పిటిషనర్ పలు ఆసక్తికర విషయాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రపంచమంతా కరోనా వైరస్ అంటువ్యాధిలా వ్యాపిస్తుందని, గ్రౌండ్‌లో జనాలు భారీగా ఉంటే వ్యాప్తికి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వైబ్‌సైట్‌లో కొవిడ్‌-19కు మందును కనుగొన్నట్లు నమోదు చెయ్యలేదని తెలిపారు. అంతేకాదు కరోనా భయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇటలీ ఫెడరేషన్ లీగ్‌నూ  ఆ దేశం ప్రభుత్వం ఫ్యాన్స్‌కు గ్రౌండ్‌లోకి అనుమతించకుండా నిర్వహిస్తుందని వెల్లడించారు. దీనిపై బీసీసీఐని సంప్రదించినా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు.

ఈసారి ఐపీఎల్ నిర్వహణపై రాష్ట్రాల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లీగ్‌ను వాయిదా వెయ్యాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె బీసీసీఐని కోరారు. కాగా అఫిషియల్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది.