మనిషంత గబ్బిలం.. ఫోటోలు వైరల్..

దాదాపు మనిషంత సైజులో ఉండి తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఓ భారీ గబ్బిలం కనిపిస్తే.. దానిని చూసిన మరుక్షణమే మతి పోతుంది. అయితే ఇలాంటి పరిస్థితే ఫిలిప్పైన్స్‌లోని అలెక్స్ అనే

మనిషంత గబ్బిలం.. ఫోటోలు వైరల్..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 9:43 PM

Human-sized bat from Philippines: దాదాపు మనిషంత సైజులో ఉండి తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఓ భారీ గబ్బిలం కనిపిస్తే.. దానిని చూసిన మరుక్షణమే మతి పోతుంది. అయితే ఇలాంటి పరిస్థితే ఫిలిప్పైన్స్‌లోని అలెక్స్ అనే వ్యక్తికి ఎదురైంది. ఓ పాత ఇంటి ఆవరణలో భారీ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీనిని చూసిన అలెక్స్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో దానిని ఫోటోలు తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన ఇంటి దగ్గరలో ఈ గబ్బిలం కనిపించిందని, దీని రెక్కలు దాదాపు 5.5 అడుగుల వెడల్పు ఉంటాయని పేర్కొన్నాడు.

కాగా.. ‘జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్’ అని పిలవబడే ఈ గబ్బిలాలు పూర్తి శాకాహారులని, కేవలం పండ్లను మాత్రమే తింటాయని, మాంసాహారం అసలు ముట్టవని అలెక్స్ చెప్పాడు. అలెక్స్ ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 2.63 లక్షల లైక్స్, 1.05 లక్షల రీట్వీట్స్ నమోదయ్యాయి. చాలా మంది ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.

[svt-event date=”03/07/2020,9:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]