ఫిలిప్పీన్స్‌లో పేలిన తాల్ అగ్ని పర్వతం.. 8 వేల మంది తరలింపు!

ఫిలిప్పీన్స్‌ దేశంలోని తాల్ అగ్నిపర్వతం సోమవారం పేలింది. ఈ పేలుడు ధాటికి లావా ప్రవహించి, బూడిద మేఘాలు 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) ఉత్తరం వైపుగా రాజధాని మనీలాకు వ్యాపించాయి. దీంతో 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దృశ్యమానత తక్కువగా ఉండటం వలన బూడిదతో కప్పబడిన గ్రామాల నుండి కొందరు బయటకు రాలేకపోయారు. కొందరు తమ ఇళ్లను, పొలాలను విడిచిపెట్టడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగ వల్ల ఫిలిప్ఫీన్స్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:27 pm, Mon, 13 January 20
ఫిలిప్పీన్స్‌లో పేలిన తాల్ అగ్ని పర్వతం.. 8 వేల మంది తరలింపు!

ఫిలిప్పీన్స్‌ దేశంలోని తాల్ అగ్నిపర్వతం సోమవారం పేలింది. ఈ పేలుడు ధాటికి లావా ప్రవహించి, బూడిద మేఘాలు 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) ఉత్తరం వైపుగా రాజధాని మనీలాకు వ్యాపించాయి. దీంతో 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దృశ్యమానత తక్కువగా ఉండటం వలన బూడిదతో కప్పబడిన గ్రామాల నుండి కొందరు బయటకు రాలేకపోయారు. కొందరు తమ ఇళ్లను, పొలాలను విడిచిపెట్టడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగ వల్ల ఫిలిప్ఫీన్స్ దేశంలో సోమవారం 286 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేశారు. మనీలాలో కార్యాలయాలు, పాఠశాలలను మూసివేసారు.

కాగా.. తాల్ అగ్నిపర్వతం 1977లో పేలింది. అంతకు ముందు 1911వ సంవత్సరం జనవరిలో పేలడం వల్ల 1335 మంది మరణించారు. అగ్నిపరత్వం పేలుడు వల్ల వ్యవసాయ భూములు, భవనాలు దెబ్బతిన్నాయి. లావా, దుమ్ము ధూళి వ్యాపించినందు వల్ల ప్రజలు డస్ట్ మాస్క్ లు ధరించి ఇళ్లలోపల ఉండాలని ఫిలిప్ఫీన్స్ అధికారులువిజ్ఞప్తి చేశారు.