ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

కోవిద్-19 సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 10:46 AM

PHCs remain open 24 hours in AP: కోవిద్-19 సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ ఇకపై 24 గంటలు పనిచేయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల వారు అనారోగ్యంతో ఏ సమయంలో వచ్చినా 24 గంటలు వైద్యులను అందుబాటులో ఉంచనుంది.

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 520 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో 625 పీహెచ్‌సీలను కలిపి మొత్తం 1,145ను 24 గంటలు పనిచేసేలా మార్చనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం చాలా పీహెచ్‌సీలకు ఒకే డాక్టర్‌ ఉండగా ఇకపై ప్రతి పీహెచ్‌సీకి షిప్టులవారీగా ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రోజుకు 12 గంటలపాటు ఔట్‌పేషెంట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బాధితుడు పీహెచ్‌సీకి వచ్చి ఫోన్‌ చేస్తే డాక్టర్‌ రావాల్సి ఉంటుంది. దీన్నే ఆన్‌ కాల్‌ అంటారు.

కాగా.. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 170 రకాల మందులను అందుబాటులో ఉంచుతారు. ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉంటారు. వీళ్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. పాముకాటు లేదా కుక్కకాటు వల్ల ఎవరైనా అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చి ఫోన్‌ చేసినా 10 నిమిషాల్లోనే వైద్యులు రావాల్సి ఉంటుంది. దీనివల్ల పేద రోగులకు మందుల ఖర్చులు బాగా తగ్గిపోతాయి. మండలానికొక అంబులెన్స్‌ ఉండటం వల్ల రవాణా సౌకర్యం కూడా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనం అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఈ వాహనం వెళ్లి ఉచితంగా మందులు ఇస్తుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu