దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 871 మంది మృతి
భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 53,601 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

India Corona Cases : భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 53,601 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత నాలుగు రోజులుగా నమోదైన కేసులతో పోల్చి చూస్తే ఇవాళ కాస్త కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్తగా మరో 871 మంది వైరస్ కారణంగా మరణించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కోవిడ్-19 వివరాలు
దేశంలో మొత్తం కరోనా బారినపడ్డవారు 22,68,676 దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 6,39,929 వ్యాధి బారి నుంచి కోలుకున్నావారు 15,83,489 దేశంలో కరోనా చనిపోయినవారు 45,257
దేశంలో కరోనా బాధితులు పెరుగుతున్నప్పటికీ… కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రజంట్ రికవరీ రేటు 69.80 శాతం ఉండగా… మరణాల రేటు 1.99 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 28.21శాతానికే పరిమితమవ్వడం కాస్త ఊరట కలిగించే అంశం.
Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల