Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol, Diesel Prices Hiked:పెట్రోల్ ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. ధరలను పెంచుతున్న చమురు సంస్థలు సామాన్యుడికి మరింత భారీంగా మోపుతోంది. తాజాగా....
Petrol, Diesel Prices Hiked:పెట్రోల్ ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. ధరలను పెంచుతున్న చమురు సంస్థలు సామాన్యుడికి మరింత భారీంగా మోపుతోంది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బుధవారం లీటరు పెట్రోల్ ధరపై 26 పైసలు, లీటర్ డీజిల్ ధరపై 25 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వ రంగ చమురు విక్రయ కంపెనీలు. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.71 నుంచి రూ.83,97కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.73.87 నుంచి రూ.74.12కు చేరింది.
అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.60 ఉండగా, డీజిల్ ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.80.78కి చేరింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.88 ఉంది. ప్రస్తుతం ఇంధనాలపై పన్ను తగ్గించే అంశం పరిశీలనలో లేదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇంతకు ముందు పెట్రో ధరలు గరిష్ఠ స్థాయిని తాకినప్పుడు ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 తగ్గించింది. చమురు కంపెనీలు లీటర్‌పై మరో రూ.1 తగ్గించాయి. దీని వల్ల వాహనదారులపై భారం కాస్త తగ్గే అవకాశం ఏర్పడింది.