Fake Gold Coins: నకిలీ బంగారు నాణేల పేరుతో మోసపోయిన హైదరాబాద్ వాసి.. రూ. 8 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లు
Fake Gold Coins: ఈ మధ్య కాలంలో మోసగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అమాయకులను నమ్మించి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘరానా మోసం షాక్‌కు....
Fake Gold Coins: ఈ మధ్య కాలంలో మోసగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అమాయకులను నమ్మించి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘరానా మోసం షాక్‌కు గురి చేసేలా ఉంది. నకిలీ బంగారం నాణేల పేరుతో అనంతపురం జిల్లా బెలుగుప్పలో ఘరానా మోసం జరిగింది. కేటుగాళ్ల చేతిలో హైదరాబాద్‌కు చెందిన పుల్లారెడ్డి అనే వ్యక్తి దారుణంగా మోసపోయాడు. మా వద్ద 200 బంగారు నాణేలు ఉన్నాయని పుల్లారెడ్డిని నమ్మించిన కేటుగాళ్లు రూ. 8 లక్షలు నగదు తీసుకుని ఉడాయించారు.
అయితే తాను మోసపోయానని గమనించిన పుల్లారెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బెలుగుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నకిలీ బంగారు నాణేల ముఠాను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Prakasam District Road Accident: విషాదం.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి