Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నన్నెందుకు ఏ1గా చేర్చారో తెలియదు: ఏవీ సుబ్బారెడ్డి
Bowenpally Kidnap Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి హాకీ మాజీ ప్లేయర్ కిడ్నాప్ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిను పోలీసులు అరెస్టు ...
Bowenpally Kidnap Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి హాకీ మాజీ ప్లేయర్ కిడ్నాప్ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా భార్గవ్ రామ్ ఉన్నారు. సుబ్బారెడ్డితో పాటు అఖిలప్రియను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమెకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపర్చారు. దీంతో అఖిల ప్రియను14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించి, అనంతరం చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు.
అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని విచారించిన పోలీసులు.. అనంతరం ఆయనను విడుదల చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి.. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీ9తో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నన్ను ఎందుకు ఏ1 నిందితుడిగా చేర్చారో తెలియదు. ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో భూమా అఖిలప్రియపై కేసు పెట్టాను. నన్ను చంపడానికి భూమా అఖిలప్రియ సుపారీ ఇచ్చింది. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేస్తాను. ఈ కిడ్నాప్ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను అని అన్నారు.