ప్రాణం తీసుకోవడం అంత సులువా..!. తొమ్మిది నెలలు అమ్మ తన కడుపులో అత్యంత భద్రంగా దాచుకున్న ఊపిరిని..అంత ఈజీగా తీసేసుకుంటారా..?. అసలు చనిపోయేంత పెద్ద కారణం ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా..?. మానసిక నిపుణులు అయితే..ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించితే ఎటువంటి సమస్యకైనా సమాధానం దొరుకుంతుందని చెప్తున్నారు. మరి ఎందుకీ అనాలోచిత నిర్ణయాలు. ఎందుకు కన్నవాళ్లకు ఈ కడపుకోతలు.
ఓ వాట్సాప్ స్టేషస్ మనిషి ప్రాణం తీసిదంటే నమ్ముతారా.?. అటువంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో చోటుచేసుకుంది. నల్లజర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన చిత్రాన్ని వాట్పాప్ స్టేషల్‌లో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..గోపవరంలో నివశించే గౌరు శ్రీను క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అతడు సూసైడ్‌కి ముందు తీసుకున్న ఓ సెల్పీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
“నేనెవరికి అన్యాయం చేయలేదు…మోసం చేయడం కూడా నాకు రాదు. తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి ఇవ్వలేకపోయాను. మరికొన్ని రోజులు సమయమిస్తే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. కానీ గత మూడు రోజులుగా వాట్సాప్ స్టేటస్‌లో నా ఫోటో పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. దుర్గాప్రసాద్, అతని కుటుంబ సభ్యులు నాపై దొంగ మాదిరిగా ముద్ర వేశారు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను హింసిస్తున్నారు. నా చావుకు కారణం మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని ఫ్యామిలీ మెంబర్స్”