కరోనా కట్టడికోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో

కరోనా కట్టడికోసం 'కఫసుర'.. ఐదు రోజుల్లోనే..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 4:10 PM

kabasura kudineer: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులోని తాంబరంలో… సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు మూలికలతో కఫసుర అనే మందును తయారుచేశారు. ఈ మందు మంచి ఫలితాలు ఇస్తోంది. ఎస్ ఆర్ ఎం ఆస్పత్రిలోని కరోనా బాధితులకు ఈ మందును ఇచ్చి చూశారు. అక్కడ పాజిటివ్ ఉన్నవారంతా… ఐదు రోజుల్లోనే నెగెటివ్ అయిపోయారు. ఈ మందు ఐదు రోజుల్లోనే వైరస్ కు చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

కఫసుర ఒక మూలికా సమ్మేళనం, ఇందులో అల్లం, పిప్పళ్లు, లవంగం, సిరుకాంకోరి రూట్, ముల్లి రూట్, కడుక్కై, అజ్వైన్ లాంటి అనేక ఇతర మూలికల పొడి పదార్థాలు ఉంటాయి. పదార్థాలు పొడి చేసి కషాయాలను తయారు చేస్తారు. యాదృచ్ఛికంగా, రోగనిరోధక శక్తిని పెంచడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా దాని వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది, అయినప్పటికీ ఇది కోవిడ్ -19 చికిత్సకు ఔషధం కాదని స్పష్టం చేసింది.

సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) పర్మిషన్‌తో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరపాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రయోగాలూ సక్సెస్ అయితే.. అప్పుడు అధికారికంగా కఫసురకు గుర్తింపు లభిస్తుంది. వెంటనే భారీ ఎత్తున మందు ఉత్పత్తి చేయగలరు. వ్యాక్సిన్‌లా ఎక్కువ కాలం పట్టకుండానే… దీన్ని భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఈ పరిణామాలన్నీ డిసెంబర్ నాటికి కరోనా పని అయిపోయినట్లే అనే సంకేతాలు ఇస్తున్నాయి.