టార్గెట్.. చైనా. !

|

Oct 02, 2020 | 4:49 PM

సైనిక బలగాల బలోపేతానికి భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీకి మరో 6 సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు ఆర్డర్ ఇచ్చింది. రక్షణ దళాల రక్షణ పరికరాల రవాణాలో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్రమట్టానికి 16,614 ఫీట్ల ఎత్తులో ఉన్న చైనా సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యమైన ఆయుధాల తరలింపులో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు చాలా ఉపకరిస్తాయి. రక్షణ దళాల […]

టార్గెట్.. చైనా. !
Follow us on

సైనిక బలగాల బలోపేతానికి భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీకి మరో 6 సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు ఆర్డర్ ఇచ్చింది. రక్షణ దళాల రక్షణ పరికరాల రవాణాలో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్రమట్టానికి 16,614 ఫీట్ల ఎత్తులో ఉన్న చైనా సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యమైన ఆయుధాల తరలింపులో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు చాలా ఉపకరిస్తాయి. రక్షణ దళాల సామాగ్రి తరలింపులో అత్యంత విజయవంతమైన సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలకు ప్రపంచంలోనే ప్రముఖ స్థానం ఉంది. అఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలలో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలను అగ్రరాజ్యం అమెరికా అత్యంత విజయవంతంగా ఉపయోగించింది.