8 మంది పీడీపీ నేతలపై బహిష్కరణ వేటు: మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందంతో భేటీ అయిన ఎనిమిది మంది పార్టీ నాయకులను పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈ రోజు బహిష్కరించింది. ఈ నాయకులను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి బహిష్కరించాలని తమ క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసిందని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పార్టీ తెలిపింది. “ఆగస్టు 5 తరువాత జరిగిన పరిణామాలు, ప్రజల మనోభావాలను దెబ్బతీసిన భారత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న చర్యల దృష్ట్యా, కొంతమంది పార్టీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు, […]

8 మంది పీడీపీ నేతలపై బహిష్కరణ వేటు: మెహబూబా ముఫ్తీ

Edited By:

Updated on: Jan 09, 2020 | 7:22 PM

జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందంతో భేటీ అయిన ఎనిమిది మంది పార్టీ నాయకులను పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈ రోజు బహిష్కరించింది. ఈ నాయకులను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి బహిష్కరించాలని తమ క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసిందని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పార్టీ తెలిపింది. “ఆగస్టు 5 తరువాత జరిగిన పరిణామాలు, ప్రజల మనోభావాలను దెబ్బతీసిన భారత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న చర్యల దృష్ట్యా, కొంతమంది పార్టీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు, పార్టీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నారని” పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) ఒక ప్రకటనలో తెలిపింది. బహిష్కరణకు గురైన వారిలో దిలావర్ మీర్, రఫీ అహ్మద్ మీర్, జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ మజీద్ పద్రూ, రాజా మంజూర్ ఖాన్, జావైద్ హుస్సేన్ బేగ్, కమర్ హుస్సేన్ మరియు అబ్దుల్ రహీమ్ రాథర్ గా తెలుస్తోంది. వీరంతా మాజీ ఎమ్మెల్యేలు.

[svt-event date=”09/01/2020,6:40PM” class=”svt-cd-green” ]