Payal With Satyadev: సత్యదేవ్‌తో జతకట్టనున్న ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ… త్వరలోనే అధికారిక ప్రకటన.?

Payal In 'Godse': క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి 'జ్యోతి లక్ష్మి' సినిమాతో హీరోగా మారాడు సత్యదేవ్‌. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యంగ్‌ హీరో...

Payal With Satyadev: సత్యదేవ్‌తో జతకట్టనున్న 'ఆర్‌ఎక్స్‌100' బ్యూటీ... త్వరలోనే అధికారిక ప్రకటన.?
Follow us
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 2:21 PM

Payal In ‘Godse’: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు సత్యదేవ్‌. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యంగ్‌ హీరో ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సత్య తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్‌ హీరో తాజాగా మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో తనకు విజయాన్ని అందించిన గోపీ గణేశ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించాడు. ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటి పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం. ఇక ఆర్‌ఎక్స్‌100తో తెలుగు కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ అనంతరం ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరి సత్యదేవ్‌ అయినా పాయల్‌కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Also Read: Radhe Shyam movie : ఎంత వెయిట్ చేస్తే అంత కిక్.. రాధేశ్యామ్ టీజర్‌‌‌‌‌‌‌‌పై డైరెక్టర్ క్రేజీ కామెంట్