మనో రాజధాని కర్నూలే అన్న పవన్ మాటెందుకు మార్చారు? రీజన్ ఇదే !

|

Dec 19, 2019 | 2:40 PM

ఏపీలో ఇప్పుడు ఎవరిని కదిపినా మూడు రాజధానుల ప్రతిపాదనపైనే చర్చ. రాజధాని భూబాగోతంపై అసెంబ్లీలో జరిగిన చర్చ ముంగింపులో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుంది ఏపీకి మూడు రాజధానులు వుండే ఛాన్సుందంటూ చేసిన ప్రకటన పెద్ద ప్రకంపననే సృష్టించింది. ఈ ప్రకటనపై ఒక్క అమరావతి ఏరియా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. మిగిలిన ప్రాంతాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. కొత్తగా తిరుపతిని అధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా తెరమీదికి వచ్చింది. ఇదిలా వుంటే.. జగన్ ప్రకటన చంద్రబాబును సొంత పార్టీలో […]

మనో రాజధాని కర్నూలే అన్న పవన్ మాటెందుకు మార్చారు? రీజన్ ఇదే !
Follow us on

ఏపీలో ఇప్పుడు ఎవరిని కదిపినా మూడు రాజధానుల ప్రతిపాదనపైనే చర్చ. రాజధాని భూబాగోతంపై అసెంబ్లీలో జరిగిన చర్చ ముంగింపులో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుంది ఏపీకి మూడు రాజధానులు వుండే ఛాన్సుందంటూ చేసిన ప్రకటన పెద్ద ప్రకంపననే సృష్టించింది. ఈ ప్రకటనపై ఒక్క అమరావతి ఏరియా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. మిగిలిన ప్రాంతాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. కొత్తగా తిరుపతిని అధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా తెరమీదికి వచ్చింది. ఇదిలా వుంటే.. జగన్ ప్రకటన చంద్రబాబును సొంత పార్టీలో ఇబ్బందులకు గురి చేస్తుండగా.. పవన్ కల్యాణ్‌కు తాను గతంలో అన్న మాటలే మెడకు చుట్టుకుంటున్నాయి.

జగన్ ప్రకటన వెలువడిన వెంటనే దాన్ని తుగ్లక్ డెసిషన్ అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. అయితే బాబు మాటలకు భిన్నంగా టీడీపీ నేతలు గంటా శ్రీనివాస్ రావు, కే.ఈ.కృష్ణమూర్తి, కొండ్రు మురళీ వంటి నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒక్క రాజధానికే దిక్కు లేదు.. ఇక మూడు రాజధానులా అంటూ విరుచుకుపడ్డారు.

అయితే, రాజధాని విషయంలో గతంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇపుడు తెరమీదికి వచ్చింది. గతంలో రాయలసీమ విద్యార్థుల సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేసిన జనసేనాని.. తన మనోఫలకంలో కర్నూలే అసలు రాజధాని అని.. తాను అధికారంలోకి వస్తే కర్నూలును అమరావతిని మించిన నగరంగా మారుస్తానని ప్రకటించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనో రాజధాని అన్న కర్నూలుకు హైకోర్టు వస్తే పవన్ కల్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రిక్‌గా అభివృద్ధి జరిగి, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అన్యాయంగా మిగిలి పోయిందన్న అభిప్రాయాలున్న తరుణంలో.. ఏపీలో మూడు ప్రాంతాలను సమంగా అభివ‌ద్ధి చేయాలన్న సంకల్పంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి తెచ్చారని అంటున్నారు. అయితే.. దీన్ని పవన్ కల్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయినపుడు అత్యంత ఉద్వేగంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తాజా ప్రతిపాదనను వ్యతిరేకించడమేంటని అడుగుతున్నారు.