అన్నయ్యకు ‘తమ్ముడి’ కీలక బాధ్యతలు..!

తన సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలోని నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం చేయాలని భావించిన పవన్.. దీనికి.. తన అన్నయ్యనే సరైన వ్యక్తి అని అనుకున్నారట. పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి.. దాని నాయకత్వ బాధ్యతలను నాగబాబుకు అప్పగించనున్నారని పవన్ నిర్ణయించారు. అలాగే.. క్షేత్ర స్థాయి నాయకులను పవన్ కలవడానికి వీలుపడకపోతే.. ఆ బాధ్యతలు కూడా నాగబాబునే చూసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. […]

అన్నయ్యకు తమ్ముడి కీలక బాధ్యతలు..!

Edited By:

Updated on: Jul 03, 2019 | 4:39 PM

తన సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలోని నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం చేయాలని భావించిన పవన్.. దీనికి.. తన అన్నయ్యనే సరైన వ్యక్తి అని అనుకున్నారట. పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి.. దాని నాయకత్వ బాధ్యతలను నాగబాబుకు అప్పగించనున్నారని పవన్ నిర్ణయించారు. అలాగే.. క్షేత్ర స్థాయి నాయకులను పవన్ కలవడానికి వీలుపడకపోతే.. ఆ బాధ్యతలు కూడా నాగబాబునే చూసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలోనూ నాగబాబే క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అటు కేడర్‌కు దగ్గరుంటూ, ఇటు కిందిస్థాయి నేతలతోనూ సమన్వయం చేసేవారు. ఈ అనుభవం ఉన్న కారణంగానే పవన్, నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.