
పరేశ్ రావల్..తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బాగా తెలసిన పేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్.. తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో తన విలక్షణ నటన ఆకట్టుకున్నారు. తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్‌గా విలక్షణ నటుడు పరేశ్ రావల్ ను నియమించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నటుడు పరేశ్ రావల్‌ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
We are glad to inform ” Hon’ble President of India @rashtrapatibhvn has appointed renowned actor & Padma Shri @sirpareshrawal as chairman of @nsd_india.”NSD family welcome the legend to shower his guidance to NSD for achieving new heights.@prahladspatel @MinOfCultureGoI
— National School of Drama (@nsd_india) September 10, 2020
ఎన్ఎస్ డీ (NSD) ఛైర్మన్‌గా నియమితులైన ప్రసిద్ద భారతీయ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ పరేశ్ రావల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.