AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా అరుదైన ఘనత.. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన హార్దిక్ పాండ్యా- రవీంద్ర జడేజా..

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

టీమిండియా అరుదైన ఘనత.. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన హార్దిక్ పాండ్యా- రవీంద్ర జడేజా..
Ravi Kiran
|

Updated on: Dec 02, 2020 | 8:38 PM

Share

Pandya- Jadeja Partnership: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్, జడేజాలు ఆరో వికెట్‌కు 108 బంతుల్లో 150 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే భారత్ జట్టు భారీ స్కోర్ సాధించడంలో తోడ్పడింది. వీరిద్దరూ ఆఖరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాండ్యా-జడేజాలు 21 ఏళ్ల రికార్డును బద్దలకొట్టారు. ఆస్ట్రేలియాపై ఆరో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మొదటి జోడిగా నిలిచారు. 1999లో రాబిన్, రమేష్ నెలకొల్పిన 123 రన్స్ భాగస్వామ్యాన్ని చెరిపేశారు.

కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆసీస్‌పై 13 పరుగుల తేడాతో గెలుపొంది.. సిరీస్ వైట్‌వాష్ కాకుండా ఊపిరి పీల్చుకుంది. 303 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్(75), మాక్స్‌వెల్(59) అర్ధ సెంచరీలతో రాణించారు, భారత్ బౌలర్లలో ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా,నటరాజన్  రెండేసి వికెట్లు.. కుల్దీప్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.