ప్రయోగం ఫెయిల్.. కుప్పకూలిన బాబర్-2 క్షిపణి..

| Edited By:

Mar 23, 2020 | 3:16 PM

ఓ వైపు ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వౌరస్ వ్యాపిస్తుంటే.. ఇదే సమయంలో క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. బెలుచిస్తాన్‌లో సోన్ మియాని పరీక్షాకేంద్రం నుంచి బాబర్-2 క్షిపణిని ప్రయోగించి విఫలమైంది. ఈ క్షిపణిని ఉపరితం నుంచి నింగిలోని లక్ష్యాలను చేధించేందుకు ప్రయోగించారు. 750 కిలోమీటర్లు నింగిలోకి ప్రయాణించే టార్గెట్‌తో రూపొందించారు. అయితే ప్రయోగం జరిపిన రెండు నిమిషాలు నింగిలోకి ఎగసి.. ఆ తర్వాత కుప్పకూలిపోయింది. కాగా.. […]

ప్రయోగం ఫెయిల్.. కుప్పకూలిన బాబర్-2 క్షిపణి..
Follow us on

ఓ వైపు ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వౌరస్ వ్యాపిస్తుంటే.. ఇదే సమయంలో క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. బెలుచిస్తాన్‌లో సోన్ మియాని పరీక్షాకేంద్రం నుంచి బాబర్-2 క్షిపణిని ప్రయోగించి విఫలమైంది. ఈ క్షిపణిని ఉపరితం నుంచి నింగిలోని లక్ష్యాలను చేధించేందుకు ప్రయోగించారు. 750 కిలోమీటర్లు నింగిలోకి ప్రయాణించే టార్గెట్‌తో రూపొందించారు. అయితే ప్రయోగం జరిపిన రెండు నిమిషాలు నింగిలోకి ఎగసి.. ఆ తర్వాత కుప్పకూలిపోయింది. కాగా.. ఇప్పటికే గత ఏప్రిల్‌లో పాక్ ప్రయోగించిన బాబర్‌-2 సబ్‌ సోనిక్‌ క్షిపణి ప్రయోగం కూడా విఫలమైంది.

మన డీఆర్‌డీవో డెవలప్ చేసిన నిర్బయ్ టెస్ట్‌కు ధీటుగా.. పాకిస్థాన్ చైనాతో కలిసి మిస్సెల్ టెస్ట్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. పాక్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని ఫెయిల్ అవ్వగా.. మరికొన్ని సక్సెస్‌ కూడా అయినట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి నెలలో అణుసామర్ధం గల క్రూయిజ్ మిస్సెల్‌ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించి సక్సెస్‌ అయ్యింది.