AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెషావ‌ర్‌లో విషాదం.. ఆటాడుకుంటుండగా పేలిన గ్రేనేడ్.. ఇద్దరు పిల్లలు మృతి, మరో ముగ్గురికి సీరియస్

గ్రేనేడ్‌తో ఆడుకుంటుండగా పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.

పెషావ‌ర్‌లో విషాదం.. ఆటాడుకుంటుండగా పేలిన గ్రేనేడ్.. ఇద్దరు పిల్లలు మృతి, మరో ముగ్గురికి సీరియస్
Balaraju Goud
| Edited By: |

Updated on: Jan 06, 2021 | 5:42 PM

Share

పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆట వస్తువుగా భావించి గ్రేనేడ్‌తో ఆడుకుంటుండగా పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మీద దొరికిన గ్రేనేడ్‌ను ఇంటికి తీసుకువెళ్లారు ఆ అమాయకపు చిన్నారులు. దాన్ని ఆట వస్తువుగా భావించి ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేల‌డంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, మ‌రో ముగ్గురు ప‌రిస్థితి విష‌మంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఖైబ‌ర్ ఫ‌క్తున్సా ప్రావిన్సులోని పెషావ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌గ‌రంలోని నార్త్ వెస్ట్ ప్రాంతంలో పిల్లలు ఆడుకుంటుండ‌గా వాళ్లకు గ్రేనేడ్ దొరికింద‌ని, దాన్ని ఇంటికి తీసుకు వెళ్లిన త‌ర్వాత అది పేలిన‌ట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో స‌రిహ‌ద్దులో ఉన్న పెషావ‌ర్‌లో తరుచూ మిలిటెంట్ల దాడులు జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ వాడ‌ని ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు దొరుకుతూనే ఉంటాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పెషావ‌ర్‌ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎమైనా పేలని ఆయుధాలు ఉన్నాయేమోనని తనిఖీలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి