బాలీవుడ్‌ దిగ్గజాల పూర్వీకుల నివాసగృహాలను కొనుగోలు చేస్తున్న పాక్‌ ప్రభుత్వం

ప్రతిదానికి పాకిస్తాన్‌ను ఆడిపోసుకుంటాం కానీ ఆ దేశానికి చారిత్రక సంపదలను కాపాడుకోవాలనే మంచి లక్షణం కూడా ఉంది..

బాలీవుడ్‌ దిగ్గజాల పూర్వీకుల నివాసగృహాలను కొనుగోలు చేస్తున్న పాక్‌ ప్రభుత్వం
Follow us

|

Updated on: Dec 10, 2020 | 11:13 AM

ప్రతిదానికి పాకిస్తాన్‌ను ఆడిపోసుకుంటాం కానీ ఆ దేశానికి చారిత్రక సంపదలను కాపాడుకోవాలనే మంచి లక్షణం కూడా ఉంది.. బాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌ల పూర్వీకుల ఇళ్లను పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫఖ్తున్వా ప్రావిన్స్‌ ప్రభుత్వం కొనబోతున్నది.. ఆ ఇద్దరు చిత్రసీమ దిగ్గజాల పూర్వీకుల నివాస గృహాలు పెషావర్‌లోనే ఉన్నాయి.. 1930లో రాజ్‌కపూర్‌ తాత నిర్మించిన కపూర్‌ హవేలీని కోటిన్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేయనుంది. అలాగే వందేళ్ల కిందటి దిలీప్‌కుమార్‌ పూర్వీకుల ఇంటిని సుమారు 80 లక్షల రూపాయల పెట్టి కొంటోంది.. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ నివాస గృహాల యజమానుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నమాట! వాటిని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది.. వాటిని పరరక్షించుకునేందుకు కోనుగోలుకు ప్రభుత్వం ముందుకొచ్చింది..

నిజానికి ఆ ఇళ్లను కూల్చివేసి కాంప్లెక్స్‌ కట్టాలనుకున్నారు యజమానులు. వారి ప్రయత్నాలకు పాక్‌ ప్రభుత్వం బ్రేక్‌ వేసింది..ఇప్పుడు ఈ నివాసగృహాలను కొనేసి కొద్దిగా శిథిలావస్థకు చేరుకున్న ఆ భవంతులకు మరమత్తులు చేసి భవిష్యతరాలకు వాటి గొప్పదనాన్ని తెలియచేయాలనుకుంటోంది.. రాజ్ కపూర్‌ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో పృథ్విరాజ్‌కపూర్‌ తండ్రి దేవాన్ బాషేశ్వర్‌నాథ్ కపూర్ కట్టారు. పృథ్విరాజ్‌కపూర్‌ ముగ్గురు తనయులు ఆ భవంతిలోనే కళ్లు తెరిచారు. రాజకపూర్‌ మేనమామ త్రిలోక్‌కపూర్‌ పుట్టింది కూడా ఇక్కడే! ఇక దిలీప్‌కుమార్‌ (మహ్మద్‌ యూసఫ్‌ఖాన్‌) పూర్వీకులకు చెందిన భవంతి కూడా అక్కడే ఉంది.. ప్రస్తుతం ఇది కూడా పాడుపడింది.. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?