తమ గగనతలం మీదుగా మోదీ కిర్గిస్థాన్‌కు ప్రయాణించే విమానానికి పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షాంఘై సహకార సంఘం సదస్సుకు హాజరయ్యేందుకు ఈ నెల 13న మోదీ కిర్గిస్థాన్ రాజధాని భిష్కేక్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ దేశానికి ప్రత్యేక విమానం ద్వారా వెళ్లేందుకు గగనతలాన్ని అనుమతించాలంటూ భారత అధికారులు పాక్‌ను కోరారు. దీనిపై ఆ దేశ అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఇది ఇలాం ఉంటే బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన వైమానిక దాడుల తరువాత పాకిస్తాన్ తమ దేశ దక్షిణ ప్రాంతంలో ఉన్న రెండు గగనతల మార్గాలు మినహా మిగిలిన 11 మార్గాలను మూసేసిన విషయం తెలిసిందే. కాగా 13, 14 రెండు రోజులు భిష్కేక్‌లో ఉండబోతున్న ప్రధాని మోదీ.. అక్కడికి వచ్చే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు.