Pakistan Police: మాస్కు ధరించాడని యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… ఎందకనేగా మీ సందేహం..

Pak Police Arrest For Wearing Mask: కరోనా మహమ్మారి కారణంగా మాస్కుల వాడకం తప్పనిసరిగా మారింది. గతంలో ఎప్పుడూ అలవాటు లేని వారు కూడా ఇప్పుడు...

Pakistan Police: మాస్కు ధరించాడని యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు... ఎందకనేగా మీ సందేహం..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 7:10 PM

Pak Police Arrest For Wearing Mask: కరోనా మహమ్మారి కారణంగా మాస్కుల వాడకం తప్పనిసరిగా మారింది. గతంలో ఎప్పుడూ అలవాటు లేని వారు కూడా ఇప్పుడు మాస్కులను వాడుతున్నారు. ఇక ప్రభుత్వాలు, పోలీసులు కూడా మాస్కులను తప్పనిసరి చేస్తూ ప్రకటనలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌లో ఓ కుర్రాడిని పోలీసులు మాస్కు ధరించాడని అరెస్ట్‌ చేశారు. అదేంటి.. మాస్కు ధరిస్తే ఎందుకు అరెస్ట్‌ చేశారనేగా మీ సందేహం. ఆ ప్రబుద్ధుడు చేసిన పనేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

వివరాల్లోకి వెళితే.. ప్రపంచమంతా న్యూఇయర్‌ వేడుకలు జరుపుకున్నట్లే పాకిస్థాన్‌లోనూ కొత్తేడాది వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే పాకిస్థాలోని పెషావర్‌ పట్టణంలో జరగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా ఓ యువకుడు కాస్త వెరైటీగా ఆలోచించాడు. జనాలను భయపెట్టియ్యాలని భావించిన సదరు యువకుడు.. ప్రాంక్‌ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తోడేలు ఆకారంలో ఉన్న ఓ మాస్కును ధరించి జనాలను భయపెట్టాలని చూశాడు. అయితే జనాలు భయపడ్డారో లేదో తెలియదు కానీ.. పోలీసులు మాత్రం అతణ్ని గుర్తించారు. తోడేలు మాస్కు వేసుకొని వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని బేడీలు వేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోను పాకిస్థాన్‌కు చెందిన ఒమర్‌ ఖురేషీ అనే ప్రముఖ జర్నలిస్ట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: కొత్త ఏడాదిలో తొలి పెద్ద కేసు: 12 గంటల్లో తేల్చేసిన పోలీసులు, వీడిన కాచిగూడ గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్ చోరీ మిస్టరీ