బ్రేకింగ్: లడఖ్ సరిహద్దులకు పాక్‌ యుద్ధవిమానాలు?

|

Aug 12, 2019 | 3:05 PM

కశ్మీర్‌ విభజన, 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  భారత్ నిర్ణయంపై పాక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసుకుంది. భారత్‌ కూడా దీటుగానే బదులిస్తుంది.  ఈ నేపథ్యంలో పాక్ చర్యలు కాస్త హద్దుమీరుతున్నాయి. లడఖ్ సమీపంలోని ఫార్వర్డ్‌ బేస్‌లకు పాక్‌ బలగాలు సైనిక సామగ్రిని పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. స్కర్దు ఎయిర్‌బేస్‌ వద్ద పాక్‌ యుద్ధ విమానాలను తీసుకొస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. […]

బ్రేకింగ్: లడఖ్ సరిహద్దులకు పాక్‌ యుద్ధవిమానాలు?
Follow us on

కశ్మీర్‌ విభజన, 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  భారత్ నిర్ణయంపై పాక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసుకుంది. భారత్‌ కూడా దీటుగానే బదులిస్తుంది.  ఈ నేపథ్యంలో పాక్ చర్యలు కాస్త హద్దుమీరుతున్నాయి. లడఖ్ సమీపంలోని ఫార్వర్డ్‌ బేస్‌లకు పాక్‌ బలగాలు సైనిక సామగ్రిని పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. స్కర్దు ఎయిర్‌బేస్‌ వద్ద పాక్‌ యుద్ధ విమానాలను తీసుకొస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

యుద్ధ విమానాల ఆపరేషన్స్‌లో ఉపయోగించే సామగ్రిని పాక్‌ సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక.. పాక్‌ తమ జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్‌బేస్‌కు తరలించే యోచనలో ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించినట్లు సమాచారం. స్కర్దు ఎయిర్‌బేస్‌ లడఖ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్‌ చేపట్టే సైనిక ఆపరేషన్స్‌కు ఎక్కువగా ఈ బేస్‌నే ఉపయోగిస్తుంటారు.  ఇప్పుడు ఆ వాయు స్థావరానికి సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  తాజాగా కశ్మీర్‌‌పై భారత్ నిర్ణయం నేపథ్యంలో పాక్‌ దుందుడుకు చర్యలకు పాల్పడుతుందా అనే తలెత్తుతున్నాయి.