కరోనా వ్యాక్సిన్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా గుడ్ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు యుద్ధం జరుగుతున్న వేళ వివిధ దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఆయా దశల్లో ఉన్నాయి. అయితే, చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 9 వ్యాక్సిన్లలో..

కరోనా వ్యాక్సిన్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:42 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు యుద్ధం జరుగుతున్న వేళ వివిధ దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఆయా దశల్లో ఉన్నాయి. అయితే, చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 9 వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా ఒకటి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ – ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వలంటీర్‌కు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వగా అతను అనారోగ్యం బారినపడటంతో ట్రయల్స్‌ను నిలిపివేస్టున్నట్లు బుధవారం(సెప్టెంబర్ 9) ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ సేఫ్టీపై ఓ స్వతంత్ర కమిటీని నియమించగా… బ్రిటన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ సేఫ్టీని ధ్రువీకరిస్తూ ఆ కమిటీ మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీకి సిఫారసు చేసింది. ఎంహెచ్ఆర్ఏ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో తిరిగి క్లినికల్ ట్రయల్స్ పునరుద్దరించారు. దీనికి సంబంధించి ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్‌లోని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(MHRA) వ్యాక్సిన్‌కు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపింది. దీంతో కోవిడ్ 19 వ్యాక్సిన్ AZD1222 క్లినికల్ ట్రయల్స్‌ తిరిగి మొదలయ్యాయి.